కొవిడ్-19 కేసులకు.. వైద్య సేవలందించే ప్రక్రియలో భాగంగా.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కేజీహెచ్‌లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించిన అనంతరం... ప్రతీ పడకకు ఆక్సిజన్ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 1070 పడకల్లో 870 పడకలకు మాత్రమే ఆక్సిజన్ సదుపాయం ఉంది. స్టైరీన్ గ్యాస్ లీకేజీ ఘటనలో ఒకేసారి 400 మందికిపైగా కేజీహెచ్‌కు తరలివచ్చారు. వారికి తక్షణమే ఆక్సిజన్ అందించాల్సి రావడంతో ఇబ్బందులు తలెత్తాయి. ఇటువంటి విపత్తుల సమయంలో ప్రతీ పడకకు ఆక్సిజన్ అందుబాటులో ఉంటే ఎక్కువ మంది ప్రాణాలు కాపాడవచ్చని అంశాన్ని దృష్టిలో పెట్టుకొని... మిగిలిన 570 పడకలకు కేంద్రీకృత ఆక్సిజన్ సరఫరా వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నామని ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ జి.అర్జున తెలిపారు. కేజీహెచ్ ఆసుపత్రి వార్డుల్లో 200 పడకలు, సీఎస్‌ఆర్ బ్లాక్‌లో 370 పడకలకు ఈ సదుపాయం రానుందని... దీని కోసం రూ.1.50 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: సర్జికల్ స్పిరిట్ ఘటనలో మరో ఇద్దరు మృతి