విశాఖ రైల్వే న్యూకాలనీలో మయూరి మెడికల్స్ ప్రొప్రయిటర్ పోలాకి వెంకట రమణమూర్తి కరోనాతో పోరాడి ప్రాణాలు విడిచారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ ఔషధ నియంత్రణ అధికారులు జాయింట్ డైరెక్టర్ ఎల్.ఏ.గోవిందం, అసిస్టెంట్ డైరెక్టర్ కె.రజిత, సిబ్బంది, విశాఖ కెమిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు బగ్గాం శ్రీనివాసరావు, జిల్లా సంఘం కోశాధికారి బెల్లాల సతీష్ కుమార్, కోటేశ్వరరావు తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రతి కెమిస్ట్ కోవిడ్-19 పోరాటంలో భాగంగా ప్రాణాలొడ్డి ప్రజలకు మందులు అందుబాటులో ఉండేలా పాటుపడుతున్నారని బగ్గాం శ్రీనివాసరావు అన్నారు. లాక్డౌన్ సమయంలో కూడా దేశ వ్యాప్తంగా కెమిస్ట్స్ అన్ని వేళలా సేవలందించారని గుర్తు చేశారు.
ఇవీ చూడండి...: కొత్తగా మంజూరైన పింఛన్లు, రేషన్ కార్డులు అందజేసిన ఎమ్మెల్యే