విశాఖ - తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వ ర్షాలకు జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాలైన వలస గెడ్డ , పాల గెడ్డ , ఇంతులూరివాగుల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో డొంకరాయి జలాశయం నీటిమట్టం ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. ఐదు గేట్లు ఎత్తి 34,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో తూర్పు గోదావరి జిల్లా ముంపు మండలాలకు ముప్పు పొంచి ఉండటంతో అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సీలేరు, జోలాపుట్ , బలిమెల జలాశయాలకు కూడా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అధికారులు జలాశయాలు వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఇదీ చదవండి: ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు అరెస్ట్