ETV Bharat / state

సీలేరు డొంకరాయి పవర్ కెనాల్ గండి పూడ్చివేత పనులు పూర్తి - డొంకరాయి పవర్ కెనాల్ తాజా వార్తలు

విశాఖలోని సీలేరు డొంకరాయి పవర్ కెనాల్ కు పడిన గండిని పూడ్చివేశారు. సుమారు కోటి రూ. వ్యయంతో సుమారు రెండు నెలలు శ్రమించి గండిని పూడ్చినట్లు విద్యుత్ అధికార్లు తెలిపారు.

డొంకరాయి పవర్ కెనాల్ గండి పునర్నిర్మాణం
author img

By

Published : Oct 17, 2019, 7:11 PM IST

డొంకరాయి పవర్ కెనాల్ గండి పునర్నిర్మాణం

రెండు నెలలు పాటు కొనసాగిన సీలేరు కాంప్లెక్స్ లోని డొంకరాయి పవర్ కెనాల్ గండి పూడ్చివేత పనులు పూర్తయ్యాయి. ఆగస్టు12న డొంకరాయి పవర్ కెనాల్ కు భారీ గండి పడింది. పునర్నిర్మాణం కోసం సివిల్ అధికారులు చాలా ఇబ్బందులు పడ్డారు. సూమారు కోటిరూపాయలు అంచనా వ్యయంతో 65 రోజుల పాటు శ్రమించి అధికార్లు ఈ గండిని పూడ్చివేశారు. పవర్ కెనాల్ పనితీరును పరిశీలించటానికి, విజయవాడ నుంచి విచ్చేసిన ఏపీ జెన్కో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.రత్నబాబు పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. పవర్ కెనాల్ కు జలహరతి సమర్పించారు. అనంతరం 485 మెగావాట్ల డొంకరాయి పోల్లూరు జలవిద్యుత్ కేంద్రాలకు నీటిని విడుదల చేశారు. ఈ విద్యుత్పత్తితో రాష్ట్రంలో విద్యుత్ లోటుని కొంత తీర్చే అవకాశం ఉంటుందని ఈ.డి రత్నబాబు తెలిపారు. త్వరలోనే ప్రాజెక్టు అవసరమైన సివిల్ సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఇవీ చదవండి

డొంకరాయి పవర్ కెనాల్​కు గండి

Intro:AP_VSP_57_17_DONKARAYI POWER CANAL GANDI PUDCHIVETA_AV_AP10153Body:ఎట్టకేలకు సీనియర్ కాంప్లెక్స్లోని డొంకరాయి పవర్ కెనాల్ గండి పూడ్చివేత పనులు పూర్తయ్యాయి పవర్ కెనాల్ పనులను పరిశీలించడం కోసం వచ్చిన న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చేతులమీదుగా లాంఛనంగా కెనాల్ నీటి విడుదల చేశారు.గత రెండు నెలల క్రితం ఆగస్టు12న డొంకరాయి పవర్ కెనాలకు బారిగండి పడింది.పునర్నిర్మాణం కోసం సివిల్ అదికారులు నానా యాతన పడ్డారు వాతావరణం అనుకూలించకపోవటం తొ బాటుగా వర్షపాతం అదికంగా నమోదు కావడంతో ఒకపక్క వర్షం కురుస్తున్న పటికి గండి పూడ్చేపనులను అవకాశం వున్న సమయంలో నిర్వహించారు సమారు కోటిరూపాయలు అంచనా వ్యయంతో 65 రోజుల పాటు శ్రమించి సివిల్ ఎస్.ఇ. రామలింగకోటేశ్వరరావు.ఈ.ఇ.వి.ఎల్.రమేష్, విద్యుత్ సౌదాకు చెందిన ఎస్.ఈ,శేఖర్ , ఈ ఈచంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో పూర్తచేయించారు.ఈ సందర్భంగా పవర్ కెనాలు పనితీరును పరిశిలించటానికి విచ్చేసిన ఏపీ జెన్కోఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.రతనబాబు (విద్యుత్ సౌదా) పవర్ కెనాల్ లో ఉన్న గంగమ్మ తల్లికి లాంచనంగా పసుపు కుంకుమ పుష్పాలతో జలహరతి సమర్పించారు.అనంతరం 485 మెగావాట్ల డొంకరాయి పోల్లూరు జలవిద్యుత్ కేంద్రాలకు విద్యుత్ ఉత్పత్తి కి కావలసిన నీటిని కెనాలు లోకి వదిలారు.దాంతో రెండు నెలల కాలం నుండి పూర్తిస్దాయిలొ రాష్ట్రానికి కావలిసిన విద్యుత్ ను అందించటం లొ కోల్పోయిన నష్టాన్ని నుండి బయట పడే అవకాశం ఉందని డొంకరాయి పోల్లూరు జలవిద్యుత్ కేంద్రాలు లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడంతో ఇక నిరంతర విద్యుత్ ను ఈ ప్రాజెక్టు లనుండి అందించవచ్చని,అదేవిధంగా రాష్ట్రంలో విద్యుత్ లోటు ని కొంత తీర్చే అవకాశం ఉంటుందని ని ఇ.డి తెలిపారు.త్వరలొనే పూర్తిస్దాయిలొ సివిల్ సిబ్బందిని నియమిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లొ చీప్ ఇంజనీర్ ఎల్.మోహనరావు, ఎస్.ఇ,వెంకటేశ్వరరావు, ఏ.ఎస్.ఒ.బసవ.శ్రీనువాసరావు తదితరజెన్కొసిబ్బంది పాల్గొన్నరు.Conclusion:M Ramanarao
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.