ETV Bharat / state

ముఖం పోల్చుకో.. పింఛను పుచ్చుకో! - special face reading app in pensions distribution news update

విశాఖపట్నం జిల్లాలో గత నెల సర్వర్‌ సమస్యతో సామాజిక పింఛన్ల పంపిణీలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాగే గత రెండు నెలల నుంచి బయో మెట్రిక్‌ ద్వారానే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. అయితే కొంతమంది లబ్ధిదారులకు వేలిముద్రలు సరిగ్గా పడకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇకపై ఆ సమస్య లేకుండా లబ్ధిదారులకు ముఖ కవళికల (ఫేస్‌ రీడింగ్‌) ఆధారంగా పింఛన్ లు ఇస్తున్నారు.

Distribution of pensions through a special face reading app
ప్రత్యేక యాప్ ద్వారా పింఛన్ల పంపిణీ
author img

By

Published : Oct 1, 2020, 1:00 PM IST

గత రెండు నెలల నుంచి బయో మెట్రిక్‌ ద్వారానే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. అయితే కొంతమంది లబ్ధిదారులకు వేలిముద్రలు సరిగ్గా పడకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పంపిణీ బాధ్యులైన గ్రామ/వార్డు సచివాలయ కార్యదర్శులు, వీఆర్వోల అథంటికేషన్‌ వేస్తేనే వృద్ధులకు పింఛను అందేది. ఈనెల నుంచి ఆ సమస్య లేకుండా వేలిముద్రలు పడని లబ్ధిదారులకు ముఖ కవళికల (ఫేస్‌ రీడింగ్‌) ఆధారంగా సొమ్ములు చేతికి అందించబోతున్నారు. దీనికోసం వారి ముఖ కవళికలను గుర్తించడానికి వీలుగా ఆర్‌బీఐఎస్‌ అనే యాప్‌ ద్వారా లబ్ధిదారుల చిత్రాలను అప్‌లోడ్‌ చేశారు. జిల్లాలో ఇలాంటి వాళ్లు సుమారు అయిదు వేలకు పైగా ఉంటారని అంచనా.

జిల్లాలో ఈ నెలకు సంబంధించి 14 విభాగాల్లో 4,87,208 మందికి రూ.117.74 కోట్ల పింఛన్ల సొమ్ము మంజూరైంది. గడిచిన నెలకంటే రెండు వేల మంది ఈనెల కొత్తగా పింఛన్లు అందుకోబోతున్నారు. మంజూరైన మొత్తాన్ని ఇప్పటికే పింఛన్‌ పంపిణీ బాధ్యులైన పంచాయతీ, గ్రామ సచివాలయ కార్యదర్శులు బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసి వాలంటీర్ల చేతికి అందజేశారు.
ఈనెల కూడా అంతే..
పింఛను మొత్తాన్ని రూ. 2 వేల నుంచి రూ.3 వేల వరకు పెంచుకుంటూ పోతామని ఎన్నికల వేళ హామీ ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయి నాలుగు నెలలవుతోంది. అప్పటి నుంచి ప్రతినెలా పెరిగిన పింఛను మొత్తం అందిస్తారేమోనని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎప్పటిలా ఆ రూ.2250 చొప్పునే ఈ నెలా అందిస్తుండడంతో వారంతా నిరాశ చెందుతున్నారు. అలాగే గతనెల సుమారు 2500 మంది పింఛన్లు నిలిచిపోయాయి. ఆదాయ పన్ను కడుతున్నారని, భూములు ఎక్కువ ఉన్నాయని, కుటుంబ సభ్యుల్లో ఉద్యోగస్తులున్నారనే కారణాలు చూపించి పింఛను నిలిపేశారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. పింఛను పునరుద్ధరించుకోవాలంటే అవేవీ నిజం కాదని సంబంధిత అధికారుల నుంచి ధ్రువపత్రాలు తెచ్చుకోవాలని సూచించడంతో ఆయా కార్యాలయాలు చుట్టు తిరుగుతున్నారు. ఈనెల కొత్తగా సెర్ప్‌ ద్వారా సైనిక్‌ పింఛన్లు కూడా పంపిణీ చేయబోతున్నారు. జిల్లాలో 116 వరకు సైనిక్‌ పింఛన్లు ఉన్నాయని రూ. 5 వేల చొప్పున వారి పింఛన్‌ మొత్తం అందజేయనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ విశ్వేశ్వరరావు తెలిపారు.

ఇవీ చూడండి...

పోడు భూముల పట్టాల పంపిణీకి స్వరం సిద్ధం- ఐటీడీఏ అధికారి వెంకటేశ్వర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.