లాక్డౌన్ కొనసాగుతున్నందున నిరాశ్రయులను పలువురు దాతలు ఆదుకుంటున్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం సీతారాంపురం గ్రామంలో సుమారు రెండు వేల మందికి నిత్యావసర సరుకులను తెదేపా నాయకులు పంపిణీ చేశారు. మాజీ సర్పంచ్ ఉరుకుట్ల వెంకటరమణ ఆధ్వర్యంలో సుమారు 3 లక్షల విలువ చేసే బియ్యం, కందిపప్పు, కూరగాయలు తదితర నిత్యావసర సరుకుల ప్యాకెట్లను గ్రామస్థులకు అందించారు. దూరం పాటిస్తూ ఇంటింటికీ తిరిగి వీటిని పంచిపెట్టారు.
ఇదీ చూడండి: