ETV Bharat / state

పాడేరు ఘాట్ రోడ్డులో డీజిల్ ట్యాంకర్ బోల్తా - visakha latest news

విశాఖ జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్​, క్లీనర్​ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ట్యాంకర్​లో ఉన్న 12వేల లీటర్లు డీజిల్ నేల పాలైంది.

Diesel tanker overturned
పాడేరు ఘాట్ రోడ్​లో డీజిల్ ట్యాంకర్ బోల్తా
author img

By

Published : Feb 23, 2021, 7:04 PM IST

విశాఖపట్నం నుంచి జి.మాడుగుల వెళ్తున్న ఓ డీజిల్ ట్యాంకర్.. పాడేరు ఘాట్ రోడ్డులో మలుపు తిరిగే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్, క్లీనర్​ను స్థానికులు మినుములూరు ఆస్పత్రికి తరలించారు. కొండకు రోడ్డుకు మధ్యలో ట్యాంకర్ బోల్తా పడటంతో డీజిల్ వృథాగా పోయింది. అటుగా వెళ్లే వాహనచోదకులు వాటర్ బాటిళ్లలో నింపుకుపోతున్నారు. 12వేల లీటర్లు డీజిల్ నేల పాలైనట్లు తెలుస్తోంది.

ఇక్కడ మలుపు అధికంగా ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇదే ప్రదేశంలో గతంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదకరమైన మలుపులో రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని వాహనచోదకులు, స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: మద్యం మత్తులో ఘర్షణ... బాణాలతో దాడి... ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.