విశాఖ జిల్లా రాంబిల్లి మండల పరిధిలోని సీతపాలెం సముద్ర తీరాన గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చుట్టుపక్కల గ్రామాలకు సమాచారం అందించినా.. ఎవరూ ముందుకు రాలేదు.
కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఆ మృతదేహాన్ని రాంబిల్లిఎస్సై , ఏఎస్సై దొర, హెడ్ కానిస్టేబుల్ మసేను, కానిస్టేబుల్ నర్సింగరావు , హోంగార్డ్ కొండబాబులు ఎలమంచిలి మార్చురీకి తరలించారు. మూడు కిలోమీటర్లు తమ భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లి మానవత్వం చాటారంటూ పోలీసులను డీజీపి గౌతమ్ సవాంగ్ అభినందించారు.
ఇదీ చదవండి: