కరోనా విజృంభణ నేపథ్యంలో శుక్రవారం విశాఖలోని సింహాద్రి అప్పన్న ఆలయంలో జరగనున్న స్వామి కల్యాణ మహోత్సవంలో భక్తులకు అనుమతి లేదని దేవస్థానం ప్రకటించింది. ఈ క్రమంలో కల్యాణోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. ప్రభుత్వం, దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని.. భక్తులు సహకరించాలని కోరారు. స్వామివారి కల్యాణ ప్రసాదం, తీర్థప్రసాదాలు, తలంబ్రాలు పొందాలనుకునే భక్తుల కోసం ఆన్లైన్ సదుపాయం కల్పించామన్నారు. ఇందుకు రూ.516 చెల్లించి ముందుగా పేరు నమోదు చేసుకుంటే వారి ఇంటికే పంపిస్తామని వివరించారు.
శుక్రవారం అర్థరాత్రిలోగా..
'ఈనెల 23 అర్ధరాత్రిలోగా UPI ID : 9491000635@SBI లేదా ఆన్లైన్ SBI A/c number : 11257208642, IFSC code : SBIN0009795 కు గానీ భక్తులు డబ్బులను పంపించొచ్చని అధికారులు పేర్కొన్నారు. అనంతరం తమ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్‌ను 6303800736 కు వాట్సప్ చేయాలన్నారు. ఇతర సమాచారం కోసం ఇదే ఫోన్ నంబర్‌ను సైతం సంప్రదించవచ్చని చెప్పుకొచ్చారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శ్రీస్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. విరాళాలు కూడా పంపించవచ్చు అని ఆలయ నిర్వాహకులు స్పష్టం చేశారు.