ETV Bharat / state

విశాఖలో ఘనంగా ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు - Parameshwari dushera festival latest News

విశాఖ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలను మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ప్రారంభించగా.. దొడ్డి కామాక్షి ఆలయంలో వైకాపా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ అమ్మవారిని దర్శించుకున్నారు.

విశాఖలో ఘనంగా ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

author img

By

Published : Oct 17, 2020, 3:12 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలను మాజీఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా శతకం పట్టు కనకదుర్గ ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. మాజీఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆర్థిక సాయంతో భవాని మాలధారణ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

కామాక్షి ఆలయంలో...

జిల్లాలోని గవరపాలెం నిదానం దొడ్డి కామాక్షి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వైకాపా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ అమ్మవారిని దర్శించుకున్నారు.
పార్క్ సెంటర్ శివశక్తి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. లక్ష్మీదేవిపేటలోని కనకదుర్గ ఆలయంలో స్వర్ణకవచ దేవిగా అమ్మవారిని అలంకరించారు.

కన్యకా పరమేశ్వరి ఆలయంలో..

కన్యకాపరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన దసరా వేడుకల్లో భాగంగా గాయత్రిదేవిగా కన్యకా పరమేశ్వరి అమ్మవారు దర్శనమిచ్చారు. అనకాపల్లి మండలం సత్యనారాయణపురం కనకదుర్గ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఇవీ చూడండి : కల్వకుర్తి ఎత్తిపోతల వద్ద ఉద్రిక్తత.. రేవంత్​రెడ్డికి గాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.