ETV Bharat / state

మన్యంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం పర్యటన - ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

ఈనెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా...అటవీ హక్కుల పత్రాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం విశాఖ మన్యంలో పర్యటించింది.

vishaka manyan
vishaka manyan
author img

By

Published : Aug 4, 2020, 7:40 PM IST

విశాఖ మ‌న్యంలో ప్ర‌భుత్వ ముఖ్య కార్య‌ద‌ర్శి ప్ర‌వీణ్‌ప్ర‌కాష్‌తో పాటు గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు రంజిత్ భాషా, జిల్లా కలెక్టర్ వినయ్​చంద్​తో పాటు పలువురు అధికారులు పర్యటించారు. అమరావతి నుంచి హెలికాప్టర్​లో విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండల కేంద్రంలోని ఏకలవ్య పాఠశాలకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన 71వ వనమహోత్సవంలో మొక్కలు నాటారు.

ఈనెల 9న ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా.... ఆదివాసీలకు అటవీ హక్కుల పత్రాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారుల బృందం మన్యంలో పర్యటించిందని స్థానిక అధికారులు తెలిపారు. రెండు రోజుల పాటు మన్యంలో పర్యటిస్తారని అన్నారు.

ఇదీ చదవండి

విశాఖలో మరో పేలుడు... తప్పిన పెను ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.