దేశీయ అవసరాలకే కాకుండా.. అంతర్జాతీయంగా పోటీ పడేందుకు అవసరమైన విధంగా ప్రణాళిక రూపొందించుకున్నామని డీసీఐ ఎండీ, సీఈవో డా.జీవైవీ విక్టర్ అన్నారు. ఇందుకు తగినట్లుగా సిబ్బంది అంకితభావంతో పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నాలుగు మేజర్ పోర్టుల కన్సార్టియంలో డీసీఐ లిమిటెడ్ 45వ ఆవిర్భావ వేడుకలు విశాఖలో జరిగాయి.
ముందుగా ఎక్కడ తమ అవసరాలు ఉన్నాయన్నది గుర్తించి.. వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమని సీఈవో వివరించారు. చిన్న స్థాయి ఉద్యోగులుగా సంస్థలో చేరిన వ్యక్తులు.. వారి అనుభవం ద్వారా ఇప్పుడు పెద్ద బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని అన్నారు. వారికి సంస్థతో ఉన్న అనుబంధం వల్ల నైపుణ్యంతో సేవలను అందించగలుగుతున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల పిల్లలు.. సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన నిర్వహించారు.
ఇదీ చదవండి: కడప ఉక్కు భాగస్వామికి ఆర్థిక కష్టాలు