విశాఖ జీవిఎంసీ వద్ద డీఎడ్ మేనేజ్మెంట్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. 2018-20 విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోటాలో చదువుకున్న డీఎడ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి తమకు నిర్వహించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో సీఎం జగన్ డీఎడ్ విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారని.. 5 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పరీక్షలు నిర్వహించకపోవటం శోచనీయమన్నారు. మేనేజ్మెంట్ విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: