ETV Bharat / state

ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తామని... కుచ్చుటోపీ! - mahesh chandra laddha

విశాఖ నగరానికి చెందిన సైబర్ మోసగాళ్ల బండారం బట్టబయలైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్యెల్యే టిక్కెట్ ఇప్పిస్తానని ప్రముఖులకు కుచ్చుటోపీ పెట్టిన వ్యక్తుల గుట్టు రట్టైంది. నిందితులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు.

మహేష్ చంద్ర లడ్డ
author img

By

Published : Jun 19, 2019, 8:56 PM IST

ఎమ్యెల్యే టిక్కెట్ ఇప్పిస్తామని ప్రముఖులను మోసం చేసిన వ్యక్తులను విశాఖ కమిషనరేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు విష్ణుమూర్తి సహా... తరుణ్​కుమార్, జయకృష్ణ, జగదీష్​లను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.5.80 లక్షల నగదు, 28.22 గ్రాముల బంగారం, 5సెల్​ఫోన్లు, ఇంటర్నెట్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.

సీఎం జగన్​మోహన్ ​రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శుల్లా మాట్లాడి నాయకులను నమ్మించారు. వాట్సప్ కాల్స్, మెసేజ్​ల ద్వారా... మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ నుంచి రూ.10లక్షలు, ప్రస్తుత పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు నుంచి రూ.15 లక్షల నొక్కేశారు. బండారు సత్యనారాయణ, దాట్ల సుబ్బరాజు, వాసుపల్లి గణేష్​కుమార్, సిదిరి అప్పలరాజు ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేశారు.

ఇదీ చదవండీ... తమిళనాడు: విలువైన పురాతన విగ్రహాలు లభ్యం

Coimbatore (TN), June 19 (ANI): Dravida Munnetra Kazhagam (DMK) party workers staged protest over water crisis in Tamil Nadu's Coimbatore on Wednesday. They held protest in front of Coimbatore City Corporation Office demanding immediate solution for the severe water crisis in Coimbatore.Many parts of Tamil Nadu are dealing with severe water scarcity with its level in reservoirs across the state declining rapidly.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.