ETV Bharat / state

కరెంట్​ బిల్లు బకాయిలు.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి విద్యుత్​ నిలిపివేత - మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కరెంట్​ బిల్లు

విశాఖలోని మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి అధికారులు విద్యుత్​ నిలిపివేశారు. ఆరు నెలలుగా విద్యుత్​ బిల్లులు చెల్లించటం లేదు. బిల్లు బకాయిలు రూ.1.30లక్షలకు చేరింది. దీంతో అధికారులు కార్యాలయానికి కరెంట్​ కట్​ చేశారు.

current supply stopped to vishaka madhurawada registrar office
రిజిస్ట్రార్ కార్యాలయానికి విద్యుత్​ నిలిపివేత
author img

By

Published : Dec 19, 2020, 10:09 PM IST

కోట్ల రూపాయలు ఆదాయాన్ని తెచ్చిపెట్టే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కరెంట్​ కష్టం వచ్చింది. కరెంట్ బిల్లులు చెల్లించలేదని విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. విశాఖలోని మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సుమారు ఆరేళ్లుగా ఓ ప్రైవేట్​ భవనంలో నడుస్తోంది. గత ఆరు నెలలుగా విద్యుత్​ బిల్లులు చెల్లించటం లేదు. మొత్తం కరెంట్​ బిల్లు రూ.1.30లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే తూర్పు ప్రాంత విద్యుత్​ పంపిణీ సంస్థ అధికారులు ఒకనెల వ్యవధిని అదనంగా ఇచ్చారు.

బడ్జెట్ విడుదల కాకపోవటం వల్ల విద్యుత్​ బిల్లు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది తెలిపారు. విద్యుత్​ సరఫరా లేనందున ఉదయం నుంచి జరగాల్సిన రిజిస్ట్రేషన్లు అన్నీ ఆగిపోయాయి. రిజిస్ట్రేషన్ల కోసం సమయం తీసుకుని వచ్చిన వారంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల జోక్యం చేసుకోవటంతో... సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో విద్యుత్​ పునరుద్ధరించారు.

ఇదీ చదవండి: సిబ్బంది నిర్వాకం..కూలి ఇంటికి రూ.1.49 లక్షల కరెంట్​ బిల్లు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.