విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం నుర్మతిలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 'సివిల్ సేవ యువహో' కార్యక్రమాల్లో భాగంగా మారుమూల ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు సంయుక్తంగా వైద్య శిబిరం నిర్వహించారు. సీఆర్పీఎఫ్ 198 బెటాలియన్ వైద్యులు, గెమ్మేలి ఆసుపత్రి వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నుర్మతి, బీరం, బోయితలి పంచాయతీలకు చెందిన 300 మంది గిరిజనులు వైద్య సహాయం పొందారు. ఖరీదైన మందులను ఉచితంగా అందజేశారు. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు కల్పిస్తున్నామని... ఇకముందు మరింత సాయం గిరిజనులకు ఉంటుందని పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్ చెప్పారు.
ఇదీ చదవండి :
'రిజర్వేషన్లు లేని ప్రాంతాల్లో స్థానిక ఎన్నికలు బహిష్కరిస్తాం'