మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా గెలిస్తే భారీగా ఆస్తి పన్ను పెరుగుతుందని... ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. విశాఖ సీపీఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
మార్కెట్ విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంచే యోచనలో వైకాపా ఉందని మధు అన్నారు. ఈ ఎన్నికల్లో సీపీఎంకు ఏ పార్టీతో పొత్తు లేదని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఎన్నికల్లో ప్రధాన అంశంగా ఉంటుందని అన్నారు. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి