విశాఖలో ప్రభుత్వ భూముల అమ్మకాలను వ్యతిరేకిస్తూ జనసేన కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. విశాఖలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములను వైకాపా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అమ్మేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వ భూములను తెగనమ్ముకుంటే.. భవిష్యత్ తరాల అవసరాలకు భూమి ఎక్కడి నుంచి దొరుకుతుందని ప్రశ్నించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములను జీవీఎంసీకి బదలాయించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈవీ చూడండి...