విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వ్యక్తిగత సహాయకుడికి కరోనా సోకింది. అరకు లోయలో సంజీవిని మొబైల్ కొవిడ్ టెస్టింగ్ వాహనాన్ని పాడేరు ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, భర్త నర్సింగరావు, వ్యక్తిగత సహాయకుడు బస్సు వద్ద కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో వ్యక్తిగత సహాయకుడుకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధరించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 4,074 కరోనా కేసులు, 54 మరణాలు