ETV Bharat / state

అనకాపల్లిలో ఒకేరోజు 25 మందికి మహమ్మారి - corona at anakapalli

విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గురువారం ఒక్క రోజే 25 మందికి కరోనా సోకింది. దీంతో అనకాపల్లి పట్టణంలో కరోనా సోకిన వారి సంఖ్య 199కి చేరింది.

corona increasing at anakapalli
అనకాపల్లిలో ఒకేరోజు 25 మందికి మహమ్మారి
author img

By

Published : Jul 24, 2020, 12:16 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో ఒక్కరోజులోనే 25 మందికి కరోనా సోకడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గురువారం మళ్ల జగన్నాథం కల్యాణ మండపంలో 75 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 25మందికి పాజిటివ్​ వచ్చింది. దీంతో అనకాపల్లి పట్టణంలో కరోనా సోకిన వారి సంఖ్య 199 కి చేరింది.

అనకాపల్లి లోని గాంధీనగరం, గవరపాలెం చదరం నూకయ్య గారి వీధి, నెయ్యిల వీధి, బుద్ధ సూర్యా రావు వీధి,మిర్యాల కాలనీ, దాసరి గెడ్డ రోడ్డు, పార్క్ సెంటర్, పీవీఆర్ నాయుడు వీధి, రజకుల కాలనీ, వేగి గౌరిసు వీధి లకు చెందిన వారికి కరోనా సోకింది. కరోనా నిర్ధరించిన వారిలో 15 మంది మహిళలు,10 మంది పురుషులు ఉన్నారు. వీరిని కరోనా కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి: ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం.. కళ్లముందే ప్రాణాలు పోయాయి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.