విశాఖ నగరంతో పాటు జిల్లావ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నెల 22న జిల్లాలో 20,302 యాక్టివ్ కేసులుంటే....28 నాటికి 16980కి తగ్గాయి. గత 24 గంటల వ్యవధిలో ఏడు వేలకుపైగా నిర్ధరణ పరీక్షలు చేస్తే 1145 కేసులు నమోదయ్యాయి. పాజిటివీటిరేటు 15.79 శాతానికి తగ్గినట్టు అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో కేసుల తీవ్రత మరింత తగ్గే సంకేతాలు ఉన్నాయని ఆయా వైద్య వర్గాలు పేర్కొన్నాయి. విశాఖలోని కేజీహెచ్‌లో రెండు రోజుల క్రితం వరకు ఏడు వందలకు పైగా బాధితులు చికిత్స పొందుతుంటే… ప్రస్తుతం ఆ సంఖ్య 500 తగ్గిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ఈనెల 27 నుంచి 28 ఉదయం వరకు కొత్తగా 1145 కేసులు నమోదయ్యాయని వైద్యులు చెప్పారు. గడిచిన 30 రోజుల క్రితం అంటే ఏప్రిల్ 29న 1129 కేసులు వచ్చాయని దీని ద్వారా మళ్లీ అంత తక్కువ సంఖ్యలో కేసులు రావడం ఇదే తొలిసారి అని అన్నారు. తాజా కేసులతో బాధితుల సంఖ్య 1, 34,985 చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 2324 మంది కోలుకున్నారని వీరి సంఖ్య 1,17,211 చేరినట్టు తెలుస్తోంది. గత 24 గంటల వ్యవధిలో 10 మంది మృతి చెందారు.
ఇదీ చూడండి:
Cocktail antibodies: కాక్‌టెయిల్ యాంటీ బాడీస్‌తో కరోనా రోగుల్లో సత్ఫలితాలు