ETV Bharat / state

పాజిటివ్ కేసుల్లో 12,500 మార్క్​ను దాటేసిన విశాఖ జిల్లా

విశాఖ జిల్లాలో రోజురోజుకి కరోనా బాధితులు పెరిగిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,227 పాజిటివ్ కేసులు నమోదు కావటంతో.. వైరస్ వ్యాప్తి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

vishaka corona cases
విశాఖలో పెరుగుతున్న కరోనా బాధితుల సంఖ్య
author img

By

Published : Aug 3, 2020, 4:15 PM IST

విశాఖ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 12,500 మార్కును దాటేసింది. గడిచిన 24 గంటల్లో 12,227 పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే.. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఎంత తీవ్రగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మృతుల సంఖ్య 100కి చేరువ అవుతుండటంతో.. ప్రజలు మరింత భయాందోళనకు గురువతున్నారు.

రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరగటంతో... కొవిడ్ బాధితులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. 89 కేంద్రాల్లో రోజుకి 300కి పైగా ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

జిల్లా వ్యాప్తంగా 900 వరకు కంటైన్​మెంట్ జోన్లు ఉండగా.. వీటిలో వెరీ యాక్టివ్ కంటైన్​మెంట్ జోన్లు మూడోవంతు పైగాానే ఉన్నాయి. ఈ వెరీ యాక్టివ్ జోన్ల నుంచే పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.

వైరస్​కు సంబంధించిన తీవ్రమైన లక్షణాలు ఉన్న బాధితులకు ఛాతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గీతం, గాయత్రి, ఎన్నారై వంటి ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం వైద్య అందిస్తున్నారు.

అతి తీవ్రమైన బాధితులకు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఆసుపత్రుల్లో సైతం మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది.

మరో వైపు.. తమను వైద్యులు పట్టించుకోవటం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రసార మాధ్యమాల్లో తమ గోడు చెప్పుకున్నా.. అధికారుల్లో చలనం లేదంటూ వాపోతున్నారు.

ఇదీ చదవండి: కుక్క అడ్డం వచ్చి ఆటో బోల్తా.. వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.