ETV Bharat / state

దండు బజార్... కేరాఫ్ కరోనా కేసులు..!

విశాఖలో దండుబజార్ ప్రాంతంలో కరోనా విజృంభిస్తోంది. మూడు వారాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 24కి చేరింది. అధికారులు అప్రమత్తమయ్యారు. ఇది నగరంలోని ప్రధాన వాణిజ్య కూడలి జగదాంబ జంక్షన్​కి అతి సమీపంలో ఉండడం వల్ల దండుబజార్​కి వేళ్లే మార్గాలన్నీ మూసి వేశారు.

దండు బజార్... కేరాఫ్ కరోనా కేసులు !
దండు బజార్... కేరాఫ్ కరోనా కేసులు !
author img

By

Published : May 26, 2020, 10:03 PM IST

విశాఖలోని దండుబజార్ ప్రాంతంలో కొవిడ్ కేసులు వరుసగా రాగా పారిశుద్ద్య కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ఇంటింటి సర్వే చేపడుతున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు నగరపాలక సంస్ధ అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరిగి కొవిడ్ లక్షణాలు ఉన్నవారిని, ఇప్పటికే పాజిటివ్ వచ్చిన వారితో ఏమైనా కాంటాక్టులు ఉన్నాయా అనే అంశాలను పరిశీలిస్తున్నారు.

దండుబజార్​లో తొలి కేసు నమోదైన వ్యక్తి ఒక వాటర్ ప్యూరిఫైర్ మెకానిక్ అని గుర్తించారు. లాక్​డౌన్ సమయంలో నెల రోజుల పాటు వేర్వేరు చోట్ల వాటర్ ప్యూరిఫైర్లను ఇళ్లలో రిపేర్లు చేసినట్టు తెలిసింది. ఈ యువకునికి ముందుగా ఈ ప్రాంతలో కొవిడ్ సోకింది. అనంతరం తన ఇంట్లో ఉన్న వృద్దురాలు, ఇతర కుటుంబసభ్యులకు సంక్రమించింది. వీరందరిని ఒక్కొక్కరిగా గుర్తించి ఒకే ప్రాంగణంలో ఉన్న దాదాపు బంధువులందరిని కలిపి 11 మందికి పాజిటివ్ తేలింది.

దండుబజార్ ప్రాంతం నగరంలోని ప్రధాన వాణిజ్య కూడలి జగదాంబ జంక్షన్​కు కలెక్టరేట్, కింగ్ జార్జి ఆసుపత్రి, బీచ్ రోడ్​కు అతి సమీపంలో ఉంటుంది. దగ్గర దగ్గర ఇళ్లు, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వారంతా ఈ ప్రాంతంలో ఉన్న ఇళ్లలో నివాసాలకు అసక్తి కనబరుస్తారు. ఇదే ప్రాంతంలో వచ్చిన పాజిటివ్ కేసుల కుటుంబసభ్యులతో సన్నిహితంగా ఉన్నవారంతా కూడా కొవిడ్ బారిన పడాల్సి వచ్చింది. దీనివల్ల ఈ ఒక్క ప్రాంతంలోనే 24 కేసులు ఇప్పటివరకు తేలాయి.

ఈ ప్రాంతంలో పూర్తి స్దాయిలో పారిశుద్ద్యం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే, ఇంటింటికి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా వారిని చైతన్య పరుస్తున్నామని ఆరోగ్య సిబ్బంది చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.