విశాఖ జిల్లా అనకాపల్లిలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సోమవారం మరో 11 మందికి కరోనా సోకింది. దీంతో పట్టణంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 270కి చేరింది. వీరిలో 140 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో 60 ఏళ్లు నిండిన 128 మంది వృద్ధులకు పరీక్షలు జరిపారు. వీటి ఫలితాలు రావాల్సి ఉందని జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామ్మూర్తి తెలిపారు.
ఇదీచదవండి