విశాఖ జిల్లాలోని తొట్లకొండపై సినిమా క్లబ్‌కు 15 ఎకరాలు కేటాయించడంపై.. భాజపా మాజీ శాసనసభ పక్ష నేత విష్ణు కుమార్ రాజుకు, బుద్దిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు వినతిపత్రం అందజేశారు.
పవిత్రమైన స్థలంలో సినిమా క్లబ్ నిర్మించడం చాలా దుర్మార్గమని.. ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని విష్ణుకుమార్ రాజు అన్నారు. జీవో నెంబరు 21ని పునఃపరిశీలన చేయాలని.. ఆ ప్రదేశంలో కాకుండా వేరే స్థలంలో కేటాయించాలని కోరారు.
పవిత్ర బౌద్ధ క్షేత్రమైన తొట్లకొండపై స్థలాన్ని సినిమా క్లబ్‌కు కేటాయింటడం దారుణమని.. బుద్దిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ అన్నారు.
ఇదీ చదవండి: