రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెడాడ రమణి కుమారి, ఆమె కుటుంబసభ్యులు వైకాపాలో చేరారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి సమక్షంలో.. విశాఖ జిల్లా తిమ్మాపురంలోని అతిథి గృహంలో వైకాపాలో చేరారు. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి.. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువై.. వారి మన్ననలు పొందుతున్నాయని.. ప్రజా సేవ నిమిత్తం వైకపాలో చేరినట్టు పెడాడ రమణి కుమారి తెలిపారు.
ఇదీ చదవండి: 4 జిల్లా ఆస్పత్రుల్లో.. సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ యంత్రాలు ప్రారంభించిన సీఎం