ETV Bharat / state

విశాఖ జిల్లాలో పాఠశాలల సముదాయల కుదింపు

author img

By

Published : Oct 10, 2020, 2:41 PM IST

పాఠశాలలో సముదాయల ( స్కూల్ కాంప్లెక్స్) కుదింపు వ్యవహారం విద్యాశాఖలో దుమారం రేపుతోంది. పాఠశాల విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా కొన్నింటిని రద్దు చేశారు. అధికార పార్టీ నేతలకు అవసరమైన చోట కొన్నింటిని కొనసాగిస్తున్నారు. ఎక్కువ మంది టీచర్లు ఉన్నా కాంప్లెక్స్ లను తక్కువ మంది ఉన్నా కాంప్లెక్స్ లో విలీనం చేశారు.

విశాఖ జిల్లాలో పాఠశాల సముదాయల కుదింపు
విశాఖ జిల్లాలో పాఠశాల సముదాయల కుదింపు

విశాఖ జిల్లాలో 260 స్కూల్ కాంప్లెక్స్ లను కుదించి 233 కు చేర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ కాంప్లెక్స్ల కు 10 నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో, పట్టణ ప్రాంతాల్లో 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉండాలని సూచించింది. ప్రభుత్వ ఆదేశాల అమలు పై వ్యతిరేకత లేకపోయినా, అన్ని రకాల అర్హతలున్న కాంప్లెక్స్​ను నిబంధనలకు విరుద్ధంగా విలీనం చేయడం తప్పని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి స్కూల్ కాంప్లెక్స్ ఎక్కడ ఉండాలి ? ఎక్కడ రద్దు చేయాలి? అనే దానిపై మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలో చర్చించి ప్రతిపాదనలు పంపాలని. కానీ జిల్లాలోని అనేక మండలాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.

* నాతవరం మండలంలో 25 మంది టీచర్లు ఉన్నప్పటికి... మల్లు భూపాలపట్నం కాంప్లెక్స్​ను 17 మంది టీచర్లు ఉన్న గునుపూడి కాంప్లెక్స్ లో విలీనం చేశారు. మల్లు భూపాలపట్నం కాంప్లెక్స్ అన్ని పాఠశాలలకు అనువుగా ఉంటుంది. అదే గునుపూడి మారుమూల ప్రాంతంలో ఉంది. ఇక్కడ అధికార పార్టీ నేత సిఫార్స్ తోనే విలీనం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

* రావికమతం మండలంకు సంబంధించి కాంప్లెక్స్ మేడివాడ లో విలీనం చేశారు. అలాగే పద్మనాభం మండలం కాంప్లెక్స్​ను అనంతవరం కాంప్లెక్స్ లో విలీనం చేశారు. ఈ గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉన్న రెడ్డిపెళ్లిలో మరో కాంప్లెక్స్ ఉంది. అనంతవరం కాంప్లెక్స్లో 31 మంది ఉపాధ్యాయులు ఉండగా పద్మనాభంలో 23 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అనంతవరం పరిధిలోని తిమ్మాపురం, గంధవరం, పాఠశాలలో పద్మనాభం ప్రాంతానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

* ఇక చీడికాడ మండలానికి సంబంధించి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తురువోలు కాంప్లెక్స్ ను కొనసాగిస్తూ , ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అప్పలరాజు పురం కాంప్లెక్స్​ను ఎత్తివేశారు.

* రోలుగుంట మండలం సంబంధించి జై నాయుడుపాలెం కాంప్లెక్స్​ను కసర్లపూడిలో విలీనం చేశారు. జె. నాయుడుపాలెంలోని 11 పాఠశాలలు కుసర్ల పూడి పాఠశాలకు 26 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

* సబ్బవరం మండలానికి సంబంధించి ఇక్కడి కాంప్లెక్స్​ను మల్లు నాయుడు పాలెం నంగినారపాడు , ఆరిపాక లో విలీనం చేశారు. సబ్బవరం పరిధిలో కొన్ని పాఠశాలలు ఈ మూడు కాంప్లెక్స్ లకు పది కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. స్కూల్ కాంప్లెక్స్ల కుదింపు వ్యవహారంలో రాజకీయ జోక్యం తగదని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. దీనిపై మరోసారి పున పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు సూచిస్తున్నాయి.

ఇదీ చదవండి

సామాన్యుడికి షాక్​..ఇంటికి రూ.1.4 లక్షల విద్యుత్​ బిల్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.