కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల వేడుకను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కమ్యూనిస్టులు జెండా ఆవిష్కరణ చేసి పార్టీ సేవలను గుర్తుచేసుకున్నారు. త్యాగానికి కమ్యూనిస్టులు ప్రతిరూపమని కొనియాడారు.
కోనాంలో వందేళ్ల వేడుకలు
విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాంలో కమ్యూనిస్టు పార్టీ వందేళ్లు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న, మండల కార్యదర్శి దేముడునాయుడు, నరసింహ మూర్తి పార్టీ శ్రేణులతో కలిసి జెండా ఆవిష్కరించారు. పేదలు, రైతులు, కార్మికులు ఇతర అన్ని వర్గాలు కోసం సీపీఎం వందేళ్లలో ఎన్నో పోరాటాలు చేసిందని సీపీఎం నాయకుడు వెంకన్న అన్నారు.
ప్రకాశంతో కమ్యూనిస్టు వేడుకలు
కమ్యూనిస్టు పార్టీ వందేళ్లు వేడుకల్లో భాగంగా.. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో సీపీఎం జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. వర్ధిల్లాలి ఎర్ర జెండా అంటూ నినాదాలు చేశారు. కార్మికుల శ్రేయస్సు కోరే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఎర్రజెండా పార్టే అని అద్దంకి సీపీఎం నాయకులు సీహెచ్ గంగయ్య అన్నారు.
సాలూరులో..
కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో గాంధీనగర్లో జెండా ఆవిష్కరణ చేశారు. పార్టీ ఎప్పుడు పేద ప్రజల పక్షాన నిలిచిందని కమ్యూనిస్ట్ నాయకులు అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రస్తుత దాడులు జరుగుతున్నాయని. హక్కులను కాపాడుకోవడానికి పార్టీలో చేరి పోరాడాలని సీపీఎం నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ సభ్యులు రవి, అర్జున్ లక్ష్మణ, శ్రీను, మోహన్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: