ETV Bharat / state

''ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచండి''

విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఈఎన్​టీ, టీబీ ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశాలలో మరుగుదొడ్లు, పరిసరాలు శుభ్రంగా ఉంచాలని సూపరింటెండెంట్​ను ఆదేశించారు.

కలెక్టర్
author img

By

Published : Jul 25, 2019, 11:43 PM IST

ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచండి

ఆసుపత్రుల్లో మరుగుదొడ్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఈఎన్​టీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశించారు. ఈఎన్​టీ, టీబీ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఔట్ పేషంట్ వార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఔషధాల గదిని సందర్శించారు. మాటలు రాని పిల్లలకు శస్త్రచికిత్స చేసి సంవత్సరం పాటు ఉచితంగా స్పీచ్ థెరపీ ఇస్తారని.. ఆస్పత్రిలో ఉండేందుకు ఉచితంగానే వసతి, భోజన సౌకర్యాలు ఉంటాయని వైద్యులు వివరించారు. లైటింగ్, సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని, రోగులకు తగిన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. టీ.బీ. ఆసుపత్రిలో పల్మనాలజీకి సంబంధించి చేసే పరీక్షలపై ఆరా తీశారు. ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్న కాంట్రక్ట్ సిబ్బంది క్రమబద్ధీకరించాలని, పొరుగుసేవల సిబ్బందిని ఒప్పంద కార్మికులుగా చేర్చాలని వారు కలెక్టర్ ను కోరారు.

ఇది కూడా చదవండి

పంచ గ్రామాల సమస్య పరిష్కారానికి కమిటీ

Intro:భారత అంతరిక్ష పరిశోధన. రాకెట్ ప్రయోగ కేంద్రం శ్రీ హరికోట నుంచి మరి కాసేపట్లో చంద్రయాన్-2 ప్రయోగం జరగనుంది. జీఎస్ఎల్వీ మార్కు3ఎం1 ద్వారా చంద్రయాన్-2ఉపగ్రహం రోదసిలోకి పంపుతారు. ప్రయోగంతో భద్రతా దళాలు తనిఖీలు చేపట్టారు. చిన్న పాటి వాన కురుస్తున్నా భద్రతా వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ప్రయోగంతో శ్రీ హరికోట అతిథులతో నిండిపోయింది. ప్రయోగం తిలకించేందుకు భారీగా ప్రజలు వచ్చారు.

Body:నెల్లూరు జిల్లా

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.