ETV Bharat / state

Low Temperatures in Manyam: విశాఖ మన్యంలో పెరిగిన చలి తీవ్రత - visakha manyamCold intensity

Low Temperatures in Manyam: మన్యంలో చలి పంజా విసురుతోంది. పాడేరు, మినుములూరులో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా భారీగా పొగమంచు కమ్ముకుంది.

Cold wave grips visakhapatnam agency
Cold wave grips visakhapatnam agency
author img

By

Published : Jan 18, 2022, 9:16 AM IST

Low Temperatures in Manyam: విశాఖ మన్యంలో చలి తీవ్రత పెరిగింది. మినుములూరులో 11.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక పాడేరులో 13 డిగ్రీలుగా ఉంది. ఫలితంగా ఏజెన్సీ ప్రాంతంలో పొగమంచు భారీగా కమ్ముకుంది. పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. చలి తీవ్రతతో గిరిజనులు అల్లాడుతున్నారు.

నేడు పలుచోట్ల వర్షాలు..
Rains in AP: మరోవైపు దక్షిణ కోస్తాలో ఒకటిరెండు చోట్ల మంగళవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో తక్కువ ఎత్తులో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు.

* సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా ప్రకాశం జిల్లా ఉలవపాడులో 37.75 మి.మీ, నెల్లూరు జిల్లా కావలిలో 23.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ రెండు జిల్లాల పరిధిలోని పలు మండలాల్లో తేలికపాటి వానలు కురిశాయి. ఆదివారం ఉదయం 8.30 నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల మధ్య నెల్లూరు జిల్లాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిశాయి.

ఇదీ చదవండి:

PRC ORDERS: ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ షాక్‌.. డిమాండ్లు బేఖాతరు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.