ETV Bharat / state

నేడు కోస్ట్‌గార్డు 45వ వ్యవస్థాపక దినోత్సవం

భారత కోస్ట్ గార్డ్ 45వ వ్యవస్థాపక దినం ఈ రోజు జరుపుకుంటోంది.1978 లో కేవలం ఏడు నౌక లతో అతికొద్ది వనరులతో ఏర్పాటైన ఈ దళం ఇప్పుడు ఏకంగా 156 నౌకలు, 62 విమానాలు సమకూర్చుకుని ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద కోస్ట్ గార్డ్ గా ఎదిగింది. 2025 నాటికి 200 కి పైగా నౌకలు, 80 విమానాలతో మరింత విస్తరించాలని లక్ష్యంగా నిర్ణయించింది.

Coast Guard's 45th raising day   at visakha
నేడు కోస్ట్‌గార్డు 45వ వ్యవస్థాపక దినోత్సవం
author img

By

Published : Feb 1, 2021, 3:52 PM IST

వయం రక్షమః అంటే మేము రక్షిస్తాము అన్న నినాదంతో పనిచేసే ఈ దళం 1977 లో ఆరంభమైంది. సముద్ర జలాలపై భారత ప్రయోజనాలను కాపాడడం, వాణిజ్య నౌకల రక్షణ, ప్రమాదాలలో సాయం, లక్ష్యంగా పనిచేస్తోంది. భారతీయ తీరగస్తీ దళం తన సామర్థ్యాన్ని 2025 నాటికి మరింతగా పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ప్రతి ఏటా ఫిబ్రవరి ఒకటో తారీకున భారతీయ తీరగస్తీ దళం (ఐసీజీ) రైజింగ్‌ డేను జరుపుకొంటుంది. ఈ నేపథ్యంలో స్థాపన మొదలు నేటి వరకు కొనసాగించిన సమర్థవంత విధులు, విజయాలతో పాటు భవిష్యత్తులో సత్తాను చాటేందుకు చేపడుతున్న బలోపేత ప్రణాళికలను ఐసీజీ వెల్లడించింది. వివరాలివి... ప్రపంచంలోనే నాలుగో అత్యంత సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన దేశంగా భారత్‌కు సముచిత స్థానం నెలకొంది. తీరప్రాంత రక్షణ కోసం 1978 ఫిబ్రవరి ఒకటిన కేవలం ఏడు జెట్టీలతో నెలకొల్పిన ఐసీజీ అంచెలంచెలుగా సమర్థవంతంగా విధులను చేపడుతోంది. సాగరజలాల్లో ప్రమాదాల్లో వాణిజ్య నౌకలు చిక్కుకుంటే కాపాడటం, తుపాన్ల సమయంలో చేపలబోట్లు, మత్స్యకారులను రక్షించడం వంటి కీలక బాధ్యతలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఐసీజీకి 156 నౌకలు, 62 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉండగా 2025 నాటికి 200 నౌకలు, 80 ఎయిర్‌క్రాఫ్ట్‌లను కలిగి ఉండేందుకు ప్రణాళికలను ఆచరణలోకి తేనుంది. ఐసీజీలోనే తొలి పరమ విశిష్ఠ సేవా పతకం, తటరక్షక్‌ పతకం వంటి అరుదైన పురస్కారాలను డైరెక్టర్‌ జనరల్‌-ఐసీజీ కె.నటరాజన్‌ దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా నిత్యం 50 నౌకలు, 12 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో గస్తీ చేపడుతోంది. గత ఏడాదిలో 10 విదేశీ చేపల బోట్ల ద్వారా మన సాగరజలాల్లోకి అక్రమంగా చొరబడ్డ 80 మంది విదేశీ మత్స్యకారులను పట్టుకున్నారు. శ్రీలంకకు చెందిన న్యూడైమండ్‌ క్రూడ్‌ కేరియర్‌ మోటార్‌ వెసల్‌ను, 3 లక్షల మెట్రిక్‌ టన్నుల చమురును ప్రమాదం నుంచి రక్షించింది.

నేడు కోస్ట్‌గార్డు 45వ వ్యవస్థాపక దినోత్సవం

ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది

ముందస్తు సన్నద్ధత, అవసరం మేరకు స్పందన అన్న లక్ష్యంగా గతేడాది హిందూమహాసముద్ర తీర ప్రాంతంలో 11 తుపాన్లు వచ్చినప్పుడు 6 వేల చేపల పడవల్లో 40 వేల మందిని సురక్షితంగా రేవులకు చేర్చింది. 333 మీటర్ల పొడవైన నౌకలో చమురు రవాణా జరుగుతుండగా సంభవించిన భీకర అగ్నిప్రమాదంలో సాహోసపేతంగా రక్షణ చర్యలు చేపట్టింది. ప్రాణాలు నిలపటమేగాక కాలుష్య విస్తరణను నిరోధించి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది

నిరంతరగస్తీ

సారెక్స్ పేరిట పౌర రక్షణ విభాగాలతో కలిసి పనిచేస్తూ తీరంలో, సముద్రంపైనా దేశ ప్రయోజనాలకు ఎక్కడా విఘాతం కలగకుండా నిరంతరగస్తీ నిర్వహిస్తూ భారత సార్వభౌమత్వాన్ని కాపాడుతోంది.

ఇదీ చూడండి. 'పంచాయతీ పోరులో తెదేపా విజయబావుటా ఎగురవేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.