ETV Bharat / state

'భోగాపురం ఎయిర్​ పోర్టు, బీచ్ కారిడార్ పనులు త్వరగా పూర్తి చేయండి'

విశాఖలో ప్రాధాన్యతా ప్రాజెక్టులైనా... భోగాపురం ఎయిర్​ పోర్టు, బీచ్ కారిడార్ పనులు త్వరగా చేయాలని ముఖ్యమంత్రి జగన్​ అధికారులను ఆదేశించారు.

'భోగాపురం ఎయిర్​ పోర్టు, బీచ్ కారిడార్ పనులు త్వరగా పూర్తి చేయండి'
'భోగాపురం ఎయిర్​ పోర్టు, బీచ్ కారిడార్ పనులు త్వరగా పూర్తి చేయండి'
author img

By

Published : Mar 23, 2021, 7:58 PM IST

విశాఖలో ప్రాధాన్యతా ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. భోగాపురం విమానాశ్రయం, బీచ్‌ కారిడార్‌ పనులు వేగంగా చేయాలని అధికారులను ఆదేశించారు. విశాఖకు పోలవరం జలాల తరలింపు పనులు వేగవంతం చేయాలన్నారు. మెట్రో ప్రాజెక్టుపై దృష్టిపెట్టాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.

విశాఖ - భీమిలి బీచ్ ‌రోడ్డు విస్తరణ, భీమిలి - భోగాపురం బీచ్‌ రోడ్డు నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. బీచ్‌ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ పూర్తి చేయాలన్నారు. భీమిలి - భోగాపురం రోడ్డుకు రూ.1,167 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు.. కొత్తగా 492 మందికి మహమ్మారి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.