ETV Bharat / state

CM Camp Office At Visakha: విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, మంత్రులకు వసతిపై కమిటీ

CM Camp Office At Visakha: విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, మంత్రులకు వసతిపై ఏపీ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం క్యాంపు కార్యాలయం, వసతి, మంత్రులు, సీనియర్‌ అధికారులకు ట్రాన్సిట్‌ వసతి గుర్తింపు కోసం అధికారుల కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎక్కడా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రభుత్వం పేర్కొనలేదు.

CM Camp Office At Visakha
CM Camp Office At Visakha
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 11, 2023, 10:33 PM IST

CM Camp Office At Visakha: దసరా అనంతరం విశాఖకు పాలన తరలిస్తామన్న సీఎం జగన్ వ్యాఖ్యలకు తగినట్టుగా... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో ముఖ్యమంత్రి జగన్​కు క్యాంపు కార్యాలయం, వసతితో పాటు మంత్రులు సీఎంఓ అధికారులు, ఇతర సీనియర్ అధికారుల కార్యాలయాలు, వసతి గుర్తింపు కోసం అధికారుల కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సీఎం జగన్ దసరాకే విశాఖకు వెళ్తారా లేదా అన్న అంశాన్ని మాత్రం ప్రభుత్వం జీవోలో పేర్కొనలేదు.

విశాఖలో ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయం, వసతి సదుపాయం, మంత్రులు, సీనియర్ అధికారులకు ట్రాన్సిట్ వసతి గుర్తింపు కోసం కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు కె.ఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి సమీక్షల కోసం సీఎం జగన్ విశాఖలో బస చేయాల్సి ఉన్నందున క్యాంప్ ఆఫీసు, బస గుర్తింపు కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, సాధారణ పరిపాలన శాఖ మానవ వనరుల విభాగం కార్యదర్శులతో కూడిన కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సంతులన అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును సీఎం సమీక్షించాల్సి ఉందని కమిటీ(Committee) తెలిపింది. దీని కోసం సీఎం జగన్ (CM Jagan) విశాఖలో ఉండాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Battle Between YV vs Vijayasai for Dasapalla Lands: దసపల్లా భూముల కోసం వైవీ వర్సెస్ విజయసాయిల మధ్య అంతర్యుద్ధం

ఉత్తరాంధ్ర జిల్లాల్లో అభివృద్ధి సమీక్షల కోసం విశాఖలో ముఖ్యమంత్రి బస చేయాల్సి ఉన్నందున ఆయనకు క్యాంపు కార్యాలయం , బస ఏర్పాటు తో పాటు సీఎంఓలోని అధికారులకూ ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా తరచూ ఆయా ప్రభుత్వ విభాగాల విభాగాధిపతులు ఆయా జిల్లాల్లో సమీక్షలు నిర్వహించాలని పేర్కొంటూ ప్రభుత్వం నిన్న మరో ఉత్తర్వు విడుదల చేసింది. క్షేత్రస్థాయి పర్యటనలు చేయటంతో పాటు స్థానికంగా ఆయా అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న దానిపైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు ముఖ్యమంత్రి సమీక్ష కోసం విశాఖ రావాల్సిన అవసరం ఉన్నందున ప్రభుత్వ విభాగాలకు చెందిన కార్యదర్శులు, హెచ్ఓడీలు విశాఖ లేదా పరిసర ప్రాంతాల్లో ట్రాన్సిట్ వసతి కోసం సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎక్కడా విశాఖను కార్యనిర్వాహక రాజధాని(Capital)గా ప్రభుత్వం పేర్కొనకపోవటం విశేషం. సీఎం జగన్ ఎప్పుడు విశాఖ(Visakha) వెళ్తారన్న అంశాన్ని కూడా ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనలేదు.

Vizag Did Not Develop During YCP Government: విశాఖపై ఎనలేని ప్రేమ చూపిస్తోన్న సర్కార్.. తెరపైకి మెట్రో కథ.. ఇన్నాళ్లూ ఏం చేశారో..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.