ఈ నెల 26 న జరిగే భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని విశాఖలో సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. పోర్టు ప్రధాన కార్యాలయం వద్ద బంద్‌కు సంబంధించిన గోడపత్రిక పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ పోర్టును అదానీ సంస్థకు అమ్మాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై 2 నెలలుగా ఆందోళన జరుగుతున్నా... మోదీ ప్రభుత్వం ప్రజా ఉద్యమాన్ని లెక్కచేయకుండా కార్పొరేటర్లకు ఊడిగం చేయడానికి సిద్దపడిందని వ్యాఖ్యానించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నగరంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. సంఘం విశాఖ నగర అధ్యక్షుడు ఆర్.ఎస్.వి కుమార్ మాట్లాడుతూ.. బంద్‌కు అందరూ సహకరించాలని కోరారు.
కడపలో...
ఈ నెల 26న నిర్వహించనున్న భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని విద్యార్థి, ప్రజా, రైతు సంఘాల నాయకులు కడపలో ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన గోడ పత్రికలను కడప సీపీఐ కార్యాలయంలో ఆవిష్కరించారు. విద్యార్థి ఐకాస నాయకులు మాట్లాడుతూ దిల్లీ సరిహద్దుల్లో గత ఐదు నెలలగా రైతులు చేస్తున్న ఉద్యమానికి కేంద్రం స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు.
విజయవాడలో....
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రైతు విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న తలపెట్టిన భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని విజయవాడలో సీపీఐ నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. బంద్‌లో విద్యార్థి, కార్మిక, రైతు, ఉద్యోగ సంఘాలు పాల్గొంటాయని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ అన్నారు. లేదంటే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
నెల్లూరులో...
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26వ తేదీన జరగనున్న భారత్ బంద్ ను విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు కోసం పార్లమెంట్ సమావేశాల్లో వైకాపా ఎంపీ లు బాయ్‌కాట్ చేయడం, తెదేపా ఎంపీలు కేంద్రాన్ని నిలదీయడం శుభపరిణామమని ఆయన నెల్లూరులో అన్నారు. గనుల ప్రవేటీకరణను పార్లమెంట్ లో వ్యతిరేకించడం అభినందనీయమన్నారు.
ఇదీ చదవండి: