విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం చిప్పాడలో మంత్రి అవంతి శ్రీనివాసరావును స్థానికులు నిలదీశారు. ఇళ్ల స్థలాల కేటాయింపు, పింఛన్ల మంజూరులో తమకు అన్యాయం జరిగిందంటూ మంత్రి ఎదుటే మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. చిప్పాడ పంచాయతీలో సామాజిక భవనం, రైతు భరోసా కేంద్రాలను మంత్రి అవంతి ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో కంచేరుపాలెం గ్రామానికి చెందిన మహిళలు..తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఓ సందర్భంలో మహిళలపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. తమ గోడు వినే నాధుడు లేడంటూ..స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇళ్ల స్థలాలు, పింఛన్ల కోసం మంత్రి అవంతిని నిలదీసిన స్థానికులు - vishakapatnam latest updates
ఇళ్ల స్థలాల కేటాయింపు, పింఛన్ల మంజూరులో తమకు అన్యాయం జరిగిందంటూ..విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం చిప్పాడలో మంత్రి అవంతి శ్రీనివాసరావును స్థానికులు నిలదీశారు. మంత్రి ఎదుటే మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు.
విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం చిప్పాడలో మంత్రి అవంతి శ్రీనివాసరావును స్థానికులు నిలదీశారు. ఇళ్ల స్థలాల కేటాయింపు, పింఛన్ల మంజూరులో తమకు అన్యాయం జరిగిందంటూ మంత్రి ఎదుటే మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. చిప్పాడ పంచాయతీలో సామాజిక భవనం, రైతు భరోసా కేంద్రాలను మంత్రి అవంతి ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో కంచేరుపాలెం గ్రామానికి చెందిన మహిళలు..తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఓ సందర్భంలో మహిళలపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. తమ గోడు వినే నాధుడు లేడంటూ..స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
బస్సు, కారు ఢీ- ఐదుగురు సజీవ దహనం