ETV Bharat / state

'మన్యంలో మావోయిస్టులు గంజాయి వ్యాపారం చేస్తున్నారు'

author img

By

Published : Jul 26, 2021, 6:23 AM IST

విశాఖ మన్యంలో మావోయిస్టులు సిద్ధాంతాలు మరిచి గంజాయి వ్యాపారం చేస్తున్నారని చింత‌ప‌ల్లి ఏఎస్పీ తుషార్​దూడీ ఆరోపించారు. వారి మాట వినని వారిని ఇన్‌ఫార్మ‌ర్ నెపంతో చంపేస్తున్నార‌ని అన్నారు. ఇలా మావోయిస్టు పార్టీ ముసుగులో అనేక అకృత్యాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఏఎస్పీ ఆరోపించారు. గిరి అభివృద్దికి అడ్దంకిగా మారిన మావోయిస్టులను మ‌న్యం నుంచి త‌రిమికొట్టాల‌ని ఏఎస్పీ తుషార్ దూడీ పిలుపునిచ్చారు.

Chintapalli ASP Tushar Dudi
చింత‌ప‌ల్లి ఏఎస్పీ తుషార్​దూడీ

విశాఖ మ‌న్యంలో మావోయిస్టులు వారి సిద్ధాంతాల‌ను మంట‌గలిపి... గంజాయి వ్యాపారం, వ్యాపార‌స్థుల‌ను, గుత్తేదారుల‌ను బెదిరించ‌టం వంటి పనులు చేస్తున్నార‌ని చింత‌ప‌ల్లి ఏఎస్పీ తుషార్‌దూడీ సంచలన ఆరోపణలు చేశారు. మావోయిస్టు పార్టీలో ఉన్న వంతల ప్రభాకర్, అశోక్, శ్రీకాంత్, బాబూరావు, మోహన్, తగ్గుపాడు శ్రీను వంటి చాలా మంది గంజాయి వ్యాపారం చేసుకుంటూ, ర‌హ‌దారి గుత్తేదారుల‌ను బెదిరించి డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారని ఆరోపించారు. అలా వచ్చిన డబ్బును మావోయిస్టు పార్టీకు నిధులుగా వాడుతున్నారని, మాట‌విన‌ని వారిని ఇన్‌ఫార్మ‌ర్ నెపంతో చంపేస్తున్నార‌ని అన్నారు. ఇలా మావోయిస్టు పార్టీ ముసుగులో అనేక అకృత్యాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఏఎస్పీ ఆరోపించారు.

మహిళలను మావోయిస్టులు లైంగిక వేధింపులకు గురి చేయడం సర్వసాధారణం అయిపోయిందని ఏఎస్పీ మరో ఆరోపణ చేశారు. ఇటీవ‌ల కాలంలో జి.కె వీధి మండలం జి.కొత్తపాలెం గ్రామంలో కొర్రా పిల్కు, చింతపల్లి మండలం వీరవరం గ్రామంలో గెమ్మిలి భాస్కరరావు, పొంగి సత్తిబాబు,జి.మాడుగుల మండలం వాకపల్లి గ్రామంలో గెమ్మెలి కృష్ణారావును, పెదబయలు మండలం చింతగరువు గ్రామంలో చిక్కుడు సతీష్, సత్యారావు లను మావోయిస్టులు ఇన్​ఫార్మర్ల నెపంతో చంపారన్నారు. తమ భర్తలను ఎందుకు చంపుతున్నారని ప్రశ్నించినందుకు వాళ్ల భార్యలపై, కుటుంబసభ్యులపై దాడి చేశారని ఏఎస్పీ విమర్శించారు.

ఇటీవలే... ముంచింగిపుట్టు మండలం, గోబరిపోడ గ్రామంలో వంతల రామచందర్ అనే గ్రామస్థుడు ఇంటిపై మావోయిస్టులు అర్ధరాత్రి దాడి చేశారని.. అతను లేకపోవటంతో అతని భార్యను కొట్టి... చిన్న పిల్లలతో సహా ఆమెను గ్రామం నుంచి వెళ్లగొట్టారని ఏఎస్పీ పేర్కొన్నారు. తీగలమెట్ట ఎదురుకాల్పులు వద్ద దొరికిన మావోయిస్టుల డాక్యుమెంట్లలో ఈ సంవత్సరం గంజాయి ముసుగులో ఎంత దోచుకోవాలి, రోడ్డు కాంట్రాక్టర్లను బెదిరించి వారి వద్ద నుంచి ఎంత డబ్బులు వసూలు చేయాలని ప్రణాళికలు రచించుకున్నారని ఏఎస్పీ తెలిపారు. గిరి అభివృద్దికి అడ్దంకిగా మారిన మావోయిస్టులను మ‌న్యం నుంచి త‌రిమికొట్టాల‌ని ఏఎస్పీ తుషార్ దూడీ పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

మొన్న గుంటూరు.. ఇవాళ విజయనగరం.. గుజరాతీ యువతుల హల్​చల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.