విశాఖ వాసులకు స్వచ్ఛ సర్వేక్షణ్‌పై అవగాహన కల్పించేందుకు చిన్నారులు నడుం బిగించారు. టినీ బూపర్స్ పాఠశాలలో చిన్నారులు జీవీఎంసీ కార్మికుల కృషిని తెలియజేసేలా... చేతితో బొమ్మలు గీశారు. వారిని ప్రోత్సహించేందుకు జీవీఎంసీ అధికారులు.. చిన్నారులు గీసిన చిత్రాలతో హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. బీచ్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ సన్యాసిరావు హాజరయ్యారు. చిన్న వయస్సులోనే పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండటం స్పూర్తిదాయకమన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విశాఖను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రజలందరూ ఓటు వేయాలని కోరారు.
ఇవీ చూడండి...
విశాఖకు తుపాన్ల ముప్పు.. జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలు