విశాఖ జిల్లా చీడికాడ మండలం చెరుకుపల్లి ప్రాంత గిరిజనులు తాగునీటి సమస్య పరిష్కరించాలని వేడుకుంటూ... ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గ్రామంలో మూడు చేతి బోర్లు ఉన్నా సరిగా పని చేయటం లేదన్నారు. ఒక బోరు నుంచి మట్టి నీరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బోర్లు పనిచేయక గెడ్డ నీరు తాగుతున్నామని తెలిపారు. అయితే.. 5 లక్షల రూపాయలతో బోరు బావి తీసి, పైపులైన్ ఏర్పాటుకు నిధులు మంజూరు అయినట్లు అధికారులు చెప్పారు.
కానీ.. నేటికీ ఆ పనులకు మోక్షం లభించిలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు విసుగు చెందిన గ్రామీణులు మైదాన గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, సీపీఎం మండల కార్యదర్శి దేముడునాయుడు ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యలను పరిష్కారం చేయకుంటే... మండల పరిషత్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని బాధితులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: