ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకైన ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం చెక్కులు పంపిణీ చేసింది. విశాఖ ఆరిలోవలోని అపోలో ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ చెక్కులను బాధితులకు అందించారు. విషవాయువు బాధితులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: తుపానుగా బలపడనున్న వాయుగుండం