ETV Bharat / state

'మైదాన ప్రాంతాల్లోనూ గిరిజన రైతులకు పట్టాలివ్వాలి' - tribals protest in cheedikada mandal

చీడికాడ మండలంలో గిరిజనులు ఆందోళన బాట పట్టారు. మైదాన ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలంటూ డిమాండ్​ చేశారు. ప్లకార్డులను చేతబట్టి నినదించారు.

chedikada mandal tribals protest to give lands for sowing in visakha district
చీడికాడ మండలంలో గిరిజనులు ఆందోళన
author img

By

Published : Jul 15, 2020, 2:26 PM IST

విశాఖ జిల్లా చీడికాడ మండలంలో గిరిజనులు ఆందోళన చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భౌతిక దూరం పాటించి పెద్దఎత్తున నిరసన గళం వినిపించారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు సాగులో ఉన్నవారికి పట్టాలను పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం శుభపరిణామమే అని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకన్న తెలిపారు.

కానీ.. ఏజెన్సీలోని 11 మండలాల్లోనే పట్టాలు ఇస్తామని చెబుతున్నారని, మైదాన గిరిజనుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గతంలో ఆయా మండలాల్లో గిరిజనులు రెవెన్యూ శాఖ అధికారులకు దరఖాస్తులు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అటవీ శాఖ అధికారులు మాత్రం గిరిజనుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని మండిపడ్డారు. పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

గిరిజనులకు సాగు భూమి హక్కు పత్రాలు ఇవ్వాలంటూ సీపీఎం ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.