తుళ్లూరులో రాజధాని రైతులు చేపట్టిన మహా ధర్నాలో తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ ధర్నాలో చంద్రబాబు మాట్లాడుతూ... విశాఖ అభివృద్ధి వ్యతిరేకం కాదని... అమరావతిలో రైతులకు ఇచ్చిన హామీల కోసమే పోరాడుతున్నామని స్పష్టం చేశారు. విశాఖను రాష్ట్ర ఆర్థిక రాజధానిలా నిర్మించేందుకు గతంలో అనేక చర్యలు చేపట్టామని చంద్రబాబు అన్నారు. ఐటీ హబ్, పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ సమాన దూరమనే అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశామని చంద్రబాబు స్పష్టంచేశారు. అభివృద్ధి కోసం ఒప్పందాలు చేసుకుంటే అన్నింటినీ వైకాపా రద్దు చేసిందని చంద్రబాబు ఆరోపించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి తెదేపా చేసిన కృషిని గుర్తుచేశారు. అభివృద్ధి అంటే ఉపాధి కల్పించే రంగాలు రావాలని చంద్రబాబు సూచించారు.
ఇదీ చదవండి :