ETV Bharat / state

Chandrababu New Vision 2047: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఎదగాలి : చంద్రబాబు - గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్సఫర్మేషన్

Chandrababu New Vision 2047: భారతదేశాన్ని అన్ని రంగాల్లో విశ్వగురువుగా ఆవిష్కరించే లక్ష్యంతో పంచ వ్యూహాలతో విజన్‌-2047 డాక్యుమెంట్‌ను రూపొందించామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉద్ఘాటించారు. నిన్న విశాఖలో డాక్యుమెంట్‌ను ఆయన ఆవిష్కరించారు. దేశ పురోభివృద్ధిలో తొలి అడుగు అయ్యేలా.. విజ్ఞాన వినియోగ సామర్థ్యం పెంపొందించి, దాన్ని అవసరమైన వర్గాలకు అందించడం ద్వారా వారి అభివృద్ధికి సోపానాలు వేయడమే ‘విజన్‌-2047’ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

chandrababu-new-vision-2047
chandrababu-new-vision-2047
author img

By

Published : Aug 16, 2023, 11:33 AM IST

Chandrababu New Vision 2047: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఎదగాలి : చంద్రబాబు

Chandrababu New Vision 2047: విజన్ 2047 పేరుతో భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించే స్థితికి ఎదగటానికి 5 వ్యూహాలతో ముందుకు సాగాలని తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గ్లోబల్ ఎకానమీగా భారత అర్దిక వ్యవస్థ, డెమోగ్రాఫిక్ మేనేజ్​మెంట్ సాంకేతికత భావి నాయకత్వం, ఎనర్జీ భద్రత, నీటి భద్రత వంటి వాటిని ప్రధానంగా.. ఈ విధాన పత్రంలో చర్చకు పెట్టారు. విశాఖలో ఈ దార్శనిక పత్రాన్ని విడుదల చేసిన ఆయన.. దీనిపై విస్తృత చర్చ జరగాలని సూచించారు.

స్వాతంత్య దినోత్సవాన్ని పురష్కరించుకుని.. విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సాగర తీరంలో వాక్ నిర్వహించారు. ఆర్కే బీచ్​లో గల ఎన్టీఆర్ విగ్రహం నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు వేల మందితో ఆయన నడక సాగించారు. దాదాపు రెండు కిలోమీటర్లకు పైగా సాగగా.. పలువురు అభిమానులతో ఆయన సెల్ఫీలు దిగారు.

Chandrababu visited Gaddar's Family : 'పేద ప్రజల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి గద్దర్​'

అనంతరం వీఎంఆర్డీఎ ఎంజీఎం మైదానంలో ఇండియా,ఇండియన్స్, తెలుగూస్-విజన్ 2047 పేరిట విధాన పత్రాన్ని విడుదల చేశారు. ‘గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్సఫర్మేషన్’ దీనిని రూపొందించింది. పలు రంగాల ప్రముఖులు, కార్పొరేట్, పర్యావరణ రంగాల ప్రతినిధులు, మాజీ ఉన్నతాధికారులు ఈ ఫోరంలో సభ్యులుగా ఉన్నారు. విజన్ 2047లో ప్రతిపాదించిన 5 వ్యూహాలపై చంద్రబాబు చర్చకు నాంది పలికారు.

గ్లోబల్ ఎకానమిగా భారత ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ పౌరులుగా భారతీయులు, బహుళ జాతీయ కంపెనీలుగా భారత కార్పొరేట్లు ఎదగాల్సిన తీరును వివరించారు. డెమోగ్రాఫిక్ మేనేజ్​మెంట్ పీ 4 మోడల్ సంక్షేమం సాంకేతికత, పరిశోధన, సృజనాత్మకత (ఇన్నోవేషన్) భావి నాయకత్వం అంశాల ప్రాధాన్యాలను చంద్రబాబు వివరించారు.

హత్యా రాజకీయాలు చేయను.. అలా చేసేవారిని రాజకీయంగా భూస్థాపితం చేస్తా: చంద్రబాబు

ఎనర్జీ సెక్యూర్ ఇండియా, డెమోక్రైజేషన్, డీకార్భనైజేషన్, డిజిటలైజేషన్ వాటర్ సెక్యూర్ ఇండియా అనుభవరీత్యా ప్రణాళికాబద్ధమైన విధానాలతో, నిర్దిష్ట దార్శనికతతో ప్రపంచానికి నాయకత్వం వహించే స్థోమతను పెంచుకోవాలని కొరారు. సవాళ్లతో కూడిన లక్ష్యాన్ని పెట్టుకుని భారతదేశం ముందుకు పయనించేలా చేయడమే ఈ విజన్ ఉద్దేశమని చంద్రబాబునాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.

భారత స్వాతంత్య్ర శత వర్షాల సంబరాలు జరుపుకునే సంవత్సరమైన.. 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. మారుతున్న నైపుణ్యతలకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో.. ఉత్పాదకతను పెంచగలిగిన నైపుణ్యాలు గల ఉద్యోగార్థులను తయారు చేయటానికి కృషి చేయాలని అన్నారు. ఇందుకోసం సమర్థమైన విధానాలు చేపట్టాలన్నారు. సిలబస్​కు, ఉద్యోగార్హతకు మధ్య ఉన్న అంతరాలను శీఘ్రమే తొలగించాలని కొరారు.

విజన్ 2047లోని ఈ అంశాలను చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. విజన్ 2047లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలు రంగాలకు చెందిన నిపుణులు, విద్యావంతులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు ఆసక్తికరంగా సమాధానాలిచ్చారు.

TDP Cheif Chandrababu Projects Tour: ఉత్తరాంధ్రలో 13 ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.