విశాఖలోని సీలేరు ఎత్తిపోతల పథకం సర్వే పనులను కేంద్ర బృందంతో కలిసి సీఎం కార్యాలయ అధికారులు పరిశీలించారు. ముంబయికి చెందిన యాప్‌కాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు కె.ఎన్. మల్లిఖార్జునరావు ఆధ్వర్యంలో.. రెండు రోజుల పాటు వారు ఇక్కడ అధ్యయనం జరిపారు. రూ.10 వేల కోట్లతో 9 యూనిట్లలో 1,350 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే పథకానికి.. సమగ్ర 'ప్రాజెక్టు రిపోర్ట్ వ్యాప్‌కోస్' తయారుచేశారు. విద్యుదుత్పత్తి కోసం వ్యాప్‌కోస్ డిజైన్, భూగర్భంలో జలవిద్యుత్ కేంద్రం ఏర్పాటు, విద్యుదుత్పత్తి అనంతరం నీటి విడుదలపై కేంద్ర బృందం ఆరా తీసింది.
కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రిని సీలేరు పథకం విషయంలో సాయం చేయాలని రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇటీవల కోరారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర పర్యావరణ అనుమతులు లభించడంతో.. స్థానిక 'ఏపీ జెన్‌కో డ్యాం అండ్ పవర్‌హౌస్' ఇంజనీర్ల నుంచి నిపుణులు వివరాలను సేకరించారు. ఈ బృందంలో కె.ఎన్ మల్లికార్జునరావు, జాతీయ జలవిద్యుత్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ (రిటైర్డు) హెచ్‌ఎస్ హెగ్డే, పరిడాబాద్ ఎన్‌ఏపీసీ చీఫ్ ఇంజనీర్ (రిటైర్డు) ఎస్‌ఈ మిట్టల్‌తో పాటు స్థానిక జెన్‌కో డీఈఈ అప్పలనాయుడు, శర్మ తదితరులు ఉన్నారు.
ఇదీ చదవండి: