ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై.. ఐఆర్ఎస్ అధికారి సుందర్ సింగ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. మూడున్నర కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించినట్టు వెల్లడించింది. విశాఖలోని ఆయన కార్యాలయం, ఇంటితోపాటు హైదరాబాద్ నివాసంలోనూ సోదాలు చేసిన సీబీఐ.. ఎఫ్.ఐ.ఆర్(FIR) నమోదు చేసి విచారణ కొనసాగిస్తోంది.
అలాగే విశాఖ, హైదరాబాద్‌లోని బంధువుల ఇళ్లలలోనూ తనిఖీలు నిర్వహించింది. విలువైన ఆస్తుల పత్రాలు, రూ.3 లక్షల 70 వేలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. విశాఖలో ఇన్‌కంటాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ అకౌంటెంట్ సభ్యుడిగా పనిచేస్తున్న సుందర్ సింగ్.. 2008-2018 మధ్య ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారని గుర్తించింది.
ఇదీ చదవండి: