విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలోని దబ్బగురువు గ్రామంలో వింత వ్యాధితో పశువులు మృత్యువాత పడుతున్నాయి. రైతులు అందించిన సమాచారం మేరకు... పాడేరు పశు వైద్య అధికారిని హన్నాకుమారి..నలుగురు సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. మృతిచెందిన పశువులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ఎర్రబస్తార్ ఆకులను తినడం వల్లే ఈ పశువులు మృతి చెందాయని తెలిపారు. అంతేగాక కలుషిత నీరు తాగి ఏడాదిలో వందలాది పశువులు మృత్యువాత పడుతుంటాయన్నారు. అయితే పశువులను కోల్పోయిన రైతులు నష్టపరిహారం పోందలేకపోతున్నారని చెప్పారు. స్థానికంగా ఉన్న సచివాలయంలో పశు వైద్య సిబ్బందిని సంప్రదిస్తే... నష్టపరిహారం త్వరగా వస్తుందని హన్నాకుమారి వెల్లడించారు.
ఇదీ చదవండి