విశాఖ జిల్లా పద్మనాభం మండలం సంగివలస గ్రామ సమీపంలో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న దాదాపు 30 మంది వలస కార్మికులు కుటుంబాలను వారి వారి స్వగ్రామాలకు చేర్చేందుకు కేథరిన్ విద్యాసంస్థల ఛైర్మన్ ఆలీవర్ రాయ్ ముందుకువచ్చారు. నోడల్ ఆఫీస్ అధికారులు అభ్యర్థన మేరకు ఓ ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. వలస కూలీలకు రొట్టెలు, బిస్కెట్స్, అరటి పండ్లు, నీళ్లు అందించారు. తహసీల్దార్ పర్యవేక్షణలో వలస కుటుంబాలను బస్సులో తరలించారు.
ఇదీ చూడండి..