విశాఖ జిల్లా నర్సీపట్నం సమీపంలోని గదబపాలెంలో 2,178 కిలోల గంజాయిని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. 9 మందిని అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. టాటా మేజిక్ , ఓ వ్యాన్‌తో పాటు మూడు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామన్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.45 నుంచి 50 లక్షల వరకు ఉంటుందని వెల్లడించారు.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస రైల్వే స్టేషన్లో గంజాయిని సరఫరా చేస్తున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. రైల్వే స్టేషన్లో తనిఖీలు చేస్తుండగా తమను చూసి నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకున్నట్లు సీఐ పైడయ్యా తెలిపారు. 43 కేజీల గంజాయిని రూ.1.26 లక్షలకు కొనుగోలు చేసినట్లు పోలీసులకు నిందితులు తెలిపారు.
ఇదీ చదవండి: DRUGS: హైదరాబాద్‌లో 3 కిలోల డ్రగ్స్ పట్టుకున్న ఎన్‌సీబీ.. నిందితుడు అరెస్ట్