విశాఖ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్‌లో ప్రత్యేక కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. రోగులు ఆసుపత్రిలో చేరే సమయంలో ఇచ్చిన రిజిస్టర్ నెంబర్‌కు.. వివరాలతో కూడిన మెసేజ్ వస్తుంది. రోగి ఆ వివరాలు తన సహాయకులకు తెలపవచ్చు. ఆ ప్రత్యేక నెంబర్‌కు కాల్ చేసి రోగి వివరాలను, అందుతున్న సేవలను వారు సైతం తెలుసుకోవచ్చు. వార్డుల వారీగా కోఆర్డినేటర్ల వ్యవస్థను డైరెక్టర్ రాంబాబు విమ్స్ లో ఏర్పాటు చేశారు. కోఆర్డినేటర్ల నంబర్లను కాల్ సెంటర్ ద్వారా మెసేజ్ రూపంలో అందిస్తున్నారు.
ఫలితంగా.. బాధితులు యోగక్షేమాలు బంధువులకు తెలిపే అవకాశం కల్పించారు. అలాగే టెలీ కన్సల్టెన్స్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆసుపత్రిలో ఉన్న రోగులు నిపుణులైన వైద్యుల సలహాలు పొందే అవకాశం కల్పించారు. ఇక... నిరంతరం రోగులకు సేవలు అందిస్తున్న వైద్యులకు పాలు, కాఫీ, టీ అందించే మినీ క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. రోగికి సహాయకులుగా వచ్చిన బంధువులకు ప్రతి రోజు ఉచిత భోజన సౌకర్యం అందిస్తున్నారు. అదే సమయంలో ఆక్సిజెన్, వెంటిలేటర్ల కొరత లేకుండా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు. విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు ఈ విషయమై మాట్లాడుతూ.. గతంలో స్టేట్ నోడల్ అధికారిగా చేసిన అనుభవంతో.. అత్యున్నత వైద్య సేవలు అందేలా ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.
ఇవీ చదవండి: