'పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు' - tdp fire on ycp
ఇసుక సమస్యపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో... పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు. సీఎం జగన్ వ్యవహార శైలి వల్ల... నిజాయతీపరులైన అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. పోలవరం కాంట్రాక్టు మేఘా సంస్థకు దక్కడం వెనుక రహస్య ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు.
దివంగత నేత మాజీమంత్రి గుడివాడ గురునాధరావు 64వ జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా నిర్వహించారు నగరంలోని టి ఎస్ ఆర్ కాంప్లెక్స్ కూడలిలో ఉన్న ఆయన విగ్రహానికి వైకాపా నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తో పాటు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ గురునాధరావు తనయుడు అయిన గుడివాడ అమర్నాథ్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఎమ్మెల్యేగా మంత్రిగా గుడివాడ గురునాధరావు చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ఆయన స్ఫూర్తితో విశాఖ నగర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వైకాపా నాయకులు వెల్లడించారు --------- బైట్ గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ఎమ్మెల్యే --------- ( ఓవర్).