నాగులచవితి సందర్భంగా వెలమ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎద్దుల బండి పోటీలు నిర్వహించారు. విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు స్థానికంగా ఉన్న ఔత్సాహికులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా చోడవరం మండలం లక్కవరంలో జరిగిన ఈ పోటీల్లో.. వల్లంపూడికి చెందిన సిద్ధివినాయక, నర్సయ్యపేటకు చెందిన ముమ్మిన రామకృష్ణ, విజయనగరం జిల్లా వావిలపాడు వాసి గండి ఆనంద వెంకటరావు, తూర్పుగోదావరికి చెందిన నామరపల్లి బండ్లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాల్గవ బహుమతులను గెలుచుకున్నాయి.
ఇదీ చదవండి: